
రొమాంటిక్ అట్మాస్పియర్ ఉన్న సినిమాల క్రేజ్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది ఇంకా పుట్టలేదు. కంటెంట్ కూడా బాగుంటే ఇక ఆ సినిమా విజయ ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. ఇటీవలి కాలంలో ఆ తరహా కంటెంట్‌కి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే నెట్టింట విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటూ, ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోన్న సంచలనాత్మక వెబ్ సిరీస్ ‘పాంచాలి’.
మహాభారతంలోని ద్రౌపది పాత్ర నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సమకాలీన కోణంలో రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్ డిజిటల్ వేదికపై సంచలనం సృష్టిస్తోంది. వినూత్నమైన కథనం, ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో సాగే ఈ సిరీస్ వీక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తోంది. ఈ సిరీస్ ప్రధాన కథాంశం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది. గ్రామీణ ఆచారాల నెపంతో భూమి అనే యువతి ఒకే ఇంట్లోని నలుగురు అన్నదమ్ములను వివాహం చేసుకుంటుంది. ఈ నలుగురు సోదరులతో కలసి జీవిస్తూ ఒక కుమారుడికి జన్మనిస్తుంది. అయితే, ఆ కుటుంబంలో పట్టణంలో చదువుకుని ఆధునిక ఆలోచనలతో పెరిగిన ఐదో తమ్ముడు కూడా ఉంటాడు. తమ వంశ పరంపర మరియు సాంప్రదాయం ప్రకారం అతడు కూడా తన వదిననే వివాహం చేసుకోవాలని నలుగురు అన్నలు కండిషన్ పెడతారు.
కానీ నగరం నుండి వచ్చిన ఆ ఐదో తమ్ముడు ఈ విచిత్రమైన ఆచారాన్ని, పెళ్లి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆ క్రమంలో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ఒకరోజు వారి ఇంట్లోని పూజ గదిలోని దేవుడి విగ్రహం నుండి ఆకస్మికంగా రక్తం కారడం కుటుంబ సభ్యులు గమనిస్తారు. ఐదో తమ్ముడు భూమిని పెళ్లి చేసుకోకపోవడం వల్లనే ఇంటికి ఈ అనర్థం మరియు దైవాగ్రహం కలుగుతోందని అన్నలు నమ్ముతారు. ఇక ఆ ఐదో తమ్ముడిని కూడా తన వలలో వేసుకుని పెళ్లికి ఒప్పించడానికి భూమి ఎలాంటి వ్యూహాలు పన్నింది, లోభం మరియు ఆకర్షణతో అతడిని ఎలా లోబరుచుకోవడానికి ప్రయత్నించింది అనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసలు తన జీవితంలో ఇంత పెద్ద త్యాగానికి సిద్ధపడి, ఐదుగురిని పెళ్లి చేసుకోవడానికి ఆమెను నడిపించిన అసలు రహస్యం ఏమిటనేది సిరీస్ ఆఖరి వరకు సస్పెన్స్‌గా నిలుస్తుంది.
Also Read: రాకాలో హాలీవుడ్ స్టార్!. ఇదే నిజమైతే ఇక మాట్లాడుకోవడాలు లేవ్
ఈ సిరీస్‌లో బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖ నటి అనుప్రియ గోయెంకా ‘భూమి’ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమన్ వర్మ, అవినాష్ ముఖర్జీ, ఉపేన్ చౌహాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుమారు 1 గంట 40 నిమిషాల రన్ టైమ్ కలిగిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియో మరియు ఉల్లు (Ullu) ఓటీటీ యాప్‌లలో ప్రేక్షకాలకు అందుబాటులో ఉంది. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ IMDbలో ఈ సిరీస్ ఏకంగా 8.7 గ్రాండ్ రేటింగ్ సాధించడం దీని విశేష ప్రజాదరణకు నిదర్శనం. తమిళం, హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ బోల్డ్ డ్రామాని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడటమే మేలని ఓటీటీ ప్రియులు సూచిస్తున్నారు.
Panchali, Anupriya Goenka





