Home

»

Latest News

'పళ్ళబురుసు' ట్రైలర్ రివ్యూ.. టూత్ బ్రష్ కోసం కొడుకు మీద కేసు పెట్టిన తండ్రి.!

Aug 7, 2026 12:57PM

పళ్ళబురుసు(టూత్ బ్రష్) కొనివ్వలేదని ఒక వృద్ధ తండ్రి తన కొడుకు మీద కేసు వేసి, కోర్టు మెట్లు ఎక్కితే ఎలా ఉంటుంది?. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ 'పళ్ళబురుసు'. 

అచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యం, గుండెలకు హత్తుకునే కుటుంబ అనుబంధాల కలబోతగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్ ప్రారంభమే చాలా ఫన్నీగా మొదలవుతుంది. “సేటు.. నా కొడుకు మీద కేసు వేయాలి!” అని ఒక ముసలాయన పోలీస్ స్టేషన్ కి వచ్చి పంచాయితీ పెడతాడు. “ఎందుకు కొట్టిండా? పొడిసిండా?” అని పోలీసులు అడిగితే... “లేదు సార్.. నాకు పళ్ళబురుసు కొనియ్యలే” అని ఆ తాత చెప్పే డైలాగ్ తోనే థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయమని అర్థమైపోతుంది. పళ్ళబురుసు కోసం ఆ తాత పడే తాపత్రయం కామెడీని పండించింది.

కానీ ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక బలమైన కుటుంబ కథ, తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ దాగి ఉన్నాయి. “ఎవరి జాగా వాళ్లకే ఉండాలి” అంటూ సరిహద్దులు, ఆస్తి తగాదాలు, హైకోర్టు వరకు వెళ్లేంత మొండితనం.. కథలో ఎమోషనల్ డెప్త్ ని పెంచాయి.

ట్రైలర్ ముగింపులో “ఏం తాతా లంకె బిందెలు వెతుకుతున్నావా?” అని అడిగితే.. “లంకె బిందెలా? అదొక్కటే తక్కువైంది నా మొఖానికి. బొంద తవ్వుతున్నా" అంటాడు. ఎవరిది అని అడగగా.. 'నాదే' అని ఆ తాత చెప్పే డైలాగ్ గుండెను పిండేసే ఎమోషన్ తో పాటు ఫన్ ఎలిమెంట్ ని కూడా మిక్స్ చేసింది.

ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ తమ సహజసిద్ధమైన నటనతో ప్రాణం పోశారు. తెలంగాణ పల్లెటూరి యాస, ఆ వాతావరణం ప్రతీ ఫ్రేమ్ లో ఎంతో నాచురల్ గా కనిపిస్తోంది. అలాగే పవన్ సీహెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రూరల్ విలేజ్ ఫీల్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. 

మొత్తానికి మన పల్లెటూరి మట్టి వాసనను, స్వచ్ఛమైన నవ్వులను, కుటుంబ సంబంధాలను గుర్తుచేసేలా ‘పల్లబురుసు’ ట్రైలర్ ఆకట్టుకుంది.

 

 

Pallaburusu, Movie Trailer, Annapurna Studios

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com