ఓటీటీ వార్: రామ్ చరణ్ vs అల్లు అర్జున్!
on Sep 21, 2021
'ఆహా' అంటే అల్లు అర్జున్! అల్లు అర్జున్ అంటే 'ఆహా'! హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీగా ప్రారంభమైన 'ఆహా'కు అల్లు అర్జున్ ఆ రేంజ్ పబ్లిసిటీ చేశాడు. పైగా, 'ఆహా'లో అల్లు అరవింద్ భాగస్వామి కావడంతో మెగా మద్దతు అంతా ఉంటుందని తెలుగు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు భావించారు. అయితే, మెగా ఫ్యామిలీలో మరో స్టార్ హీరో రామ్ చరణ్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ తమకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. దాంతో ఓటీటీ వరల్డ్‌లో ఈక్వేషన్లు మారాయని చెప్పాలి. ముఖ్యంగా అభిమానుల ఆదరణ విషయంలో కొంత మార్పు వస్తుందని చెప్పుకోవాలి.
రామ్ చరణ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువమంది హీరోలున్న కుటుంబ అభిమానుల మద్దతు అంతా ఒక ఓటీటీకి వెళ్లకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు. ఇంతకు ముందు హిందీలో రామ్ చరణ్ 'జంజీర్' చేశారు. అది తెలుగులో 'తుఫాన్'గా విడుదలైంది. అదంతగా ఆడలేదు. అయితే, ఇప్పుడు 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. సినిమా స్థాయి పరంగా చూసుకున్నా... 'ఆహా'కు ప్రచారం చేస్తున్న బన్నీతో సమానమైన, 'పుష్ప'తో పోలిస్తే కొంచెం క్రేజ్ ఎక్కువున్న 'ఆర్ఆర్ఆర్'లో హీరోను డిస్నీ తమ ప్రచారానికి తీసుకుంది.
ప్రచారకర్తలను వాడుకోవడంలోనూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్... ఆహా కంటే ఓ అడుగు ముందు ఉంది. 'ఆహా'కు ఎంటెర్టైమెంట్ ఛానల్ లేకపోవడం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు 'స్టార్ మా' ఉండటం కూడా ఇందుకు కారణం. బన్నీని యాడ్స్, ఈవెంట్స్ వరకు మాత్రమే ఆహా ఉపయోగించుకుంటోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే రామ్ చరణ్‌ను ఆల్రెడీ 'బిగ్ బాస్' షోకు తీసుకొచ్చింది. యాడ్స్ చేసింది. భవిష్యత్తులో ఇంకెన్ని చేస్తుందో చూడాలి.
ప్రస్తుతం ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా ఓటీటీ వేదికలు సైతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ఆకర్షించడానికి స్టార్ హీరోలు, హీరోయిన్లను రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు.
Also Read