
జనవరిలో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంది కానీ, ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న సినిమాలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. గత వారం 'ఫంకీ', 'కపుల్ ఫ్రెండ్లీ', 'సీతా పయనం' వంటి సినిమాలు విడుదల కాగా ఈ వారం 'హే బల్‌వంత్', 'నవాబ్ కేఫ్' సినిమాలు విడుదలవుతున్నాయి.
హే బల్‌వంత్: (Hey Balwanth)
సుహాస్, శివాని నగరం జంటగా గోపి అచ్చర దర్శకత్వంలో రూపొందిన మూవీ 'హే బల్‌వంత్'. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ, ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెడుతోంది. అసలు ఈ చిత్ర టైటిల్ 'హే భగవాన్' కాగా.. సెన్సార్ అభ్యంతరం తెలపడంతో చివరి నిమిషంలో 'హే బల్‌వంత్'గా మార్చారు. హీరో ఫ్యామిలీ చేస్తున్న సీక్రెట్ బిజినెస్ ఏంటి? అంటూ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
నవాబ్ కేఫ్: (Nawab Cafe)
శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నవాబ్ కేఫ్'. ప్రమోద్ హర్ష దర్శకుడు. హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి కూడా మొదట అనుకున్న టైటిల్ 'చాయ్ వాలా'. సెన్సార్ అభ్యంతరంతో 'నవాబ్ కేఫ్'గా మారింది. విదేశాలకు వెళ్ళాలి, గొప్పగా బతకాలని కలలు కనే చాయ్ వాలా కొడుకు కథగా ఇది తెరకెక్కింది.
ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు సందడి చేయనున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, శ్రీ చిదంబరం గారు వంటి సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.
ఈటీవీ విన్:
శ్రీ చిదంబరం గారు మూవీ - ఫిబ్రవరి 19
నెట్ ఫ్లిక్స్:
చథా పచ్చ మూవీ - ఫిబ్రవరి 19
ప్రైమ్ వీడియో:
'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' మూవీ - ఫిబ్రవరి 19
జీ5:
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ - ఫిబ్రవరి 20
రాక్షస వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 20
జియో హాట్ స్టార్:
లక్కీ ది సూపర్ స్టార్ మూవీ - ఫిబ్రవరి 20
Also Read: ప్రభాస్ గురించి వినిపిస్తున్న ఆ షాకింగ్ న్యూస్ నిజమేనా?







