ఆస్కార్‌లో ఆస్కారం దక్కింది!!
on Feb 25, 2019
91వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో వైభవంగా జరిగాయి. అందులో ఈ సారి మన ఇండియన్ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డ్ దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా రేఖా జెహతాబ్చి డైరక్షన్ లో వచ్చిన `పీరియడ్` ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ` అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించడం విశేషం. ఇంత వరకు చాలా ఇండియన్ సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి తప్ప అవార్డును గెలుచుకోలేదు. కానీ ఈ 25 మినిట్స్ డ్యూరేషన్ గల డాక్యుమెంటరీకి అవార్డ్ దక్కడంతో దర్శక నిర్మాతలు సంతోషంలో మునిగిపోయారు. నిజంగా ఇంత కాలానికి ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం.
91వ ఆస్కార్ విన్నర్స్ లిస్ట్..!!
ఉత్తమ దర్శకుడు: ఆల్పాన్సో కొరోన్ (రోమా)
ఉత్తమ చిత్రం:గ్రీన్ బుక్
ఉత్తమ నటుడు: రామి మలేక్
ఉత్తమ నటి: ఒలివియా కోల్మన్ ( ది ఫేవరేట్)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా ఆలీ
ఉత్తమ సహాయ నటి:రెజీనా కింగ్ ( ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: గ్రీన్ బుక్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేః బ్లాక్ లాన్స్ మేన్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్)
ఉత్తమ డాక్యుమెంటరీ: ఫ్రీ సోలో
ఉత్తమ సినిమాటోగ్రఫీ:ఆల్పాన్స్ కోరోన్ (రోమా)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడి
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడి
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్ (ఎండ్ ఆఫ్ సెంటెన్స్)
ఉత్తమ హెయిర్ అండ్ మేకప్: వైస్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మ్యాన్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: స్కిన్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: బ్లాక్ పాంథర్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: షాలో ( ఏ స్టార్ ఈ జ్ బోర్డ్ )