ఊపిరి ఆడియో డేట్ ఫిక్స్
on Feb 26, 2016
ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడింది? ఇద్దరూ కలిసి ఆ బంధాన్ని ఎలా కొనసాగించారు అనే కథాంశంతో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై ‘బృందావనం’ ‘ఎవడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కింగ్ నాగార్జున, ‘ఆవారా’ కార్తీ, హీరోలుగు తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఊపిరి’. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను మార్చి 1న చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
అంతే కాకుండా మార్చిలో వరల్డ్‌వైడ్‌గా ‘ఊపిరి’ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణి తదితరుల నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోకి ఫంక్షన్‌కి .వి. సూపర్‌స్టార్ సుమ, గ్లామరస్ యాంకర్ అనసూయ యాంకర్లుగా వ్యవహరించనున్నారు.