
'ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు...చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు'అంటూ హీరో శ్రీకాంత్ చేత పాడింది తన వాడ్ని గా చేసుకున్న హీరోయిన్ ఊహ. మెగా స్టార్ చిరంజీవికి సోదరిగా 'అల్లుడా మజాకా'లో కూడా చేసి మెప్పించిన ఊహ ప్రముఖ అగ్ర నటుడు మేనకోడలనే విషయం చాలా మందికి తెలియదు.
తెలుగు తెరపై తన కట్ అవుట్ కి ప్రత్యేక ముద్ర వేసిన నటుడు పీఎల్ నారాయణ. ఖైదీ లో చిరంజీవికి తండ్రిగా, రుద్రవీణలో చిరంజీవి మావయ్య గా, ఘరానా మొగుడులో చిరంజీవికి తోడు ఉండే కార్మికుడిగా చేసారంటే పిఎల్ నారాయణ ట్రాక్ రికార్డు ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ చిత్రాల ద్వారా బాగా పేరు సంపాదించాడు. అసలు పి ఎల్ నారాయణ రౌద్రంగా ఒక డైలాగ్ చెప్తే ఆ రోజుల్లో థియేటర్స్ లో విజిల్స్ సైతం మొగేవి. లాయర్, ఉపాధ్యాయుడు, రాజకీయ నాయకుడు, కార్మిక నేత, బిక్షగాడు, తాగుబోతు వంటి వైవిధ్యమైన పాత్రల్లో జీవించిన పీఎల్ నారాయణ, తెలుగు మరియు తమిళ భాషల్లో కలిపి మొత్తం సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులని అలరించారు. 'యజ్ఞం' సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పి ఎల్ నారాయణకి ఊహ స్వయానా మేనకోడలు అవుతారు. పీఎల్ నారాయణ మలయాళీ కుటుంబానికి చెందినవారైనా, గుంటూరులో జన్మించి బాపట్ల, ఒంగోలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. నాటకరంగంపై మక్కువతో ఆయన వేసిన 'కుక్క' అనే నాటకానికి జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారం దక్కింది. ఆ గుర్తింపుతోనే వెండితెరకి పరిచయమయ్యారు.
ఇది కూడా చదవండి: క్రేజీ డైరెక్టర్‌తో సూర్య 50వ సినిమా: మీరు ఊహించిన పాన్ ఇండియా డైరెక్టర్!

ఇలా నాలుగు దశాబ్దాలకు పైగా సినీ చరిత్ర కలిగిన నటుడైన పీఎల్ నారాయణ కుటుంబం నుంచే, ఆయన మేనకోడలిగా ఊహా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అద్భుతమైన హీరోయిన్ గా వెలుగొండటం విశేషం.ఊహా అసలు పేరు శివరంజని.
[Ooha Maternal Uncle Pl Narayana, Ooha, PL Narayana, Srikanth wife Ooha, Tollywood senior actors, Ooha maternal uncle, Telugu cinema facts, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]






