Home

»

Latest News

నమ్మండీ.. నమ్మకపోండీ.. ఈ పాటకు టిక్ టాక్‌లో లక్ష వీడియోలు!

Feb 6, 2020 10:39AM

 

టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ప ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకుడు. అమృతా అయ్యర్ నాయిక. అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రంలోని పాట 'నీలి నీలి ఆకాశం' సెన్సేషనల్ హిట్టయింది. ఎంతగా అంటే.. ఒక్క టిక్ టాక్‌లోనే ఈ పాతపై లక్షకు పైగా వీడియోలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రదీప్ స్వయంగా చెప్పాడు. కాగా ఈ సాంగ్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సూపర్ స్టార్ మహేశ్ లాంచ్ చేశాడు. ఆయన లాంచ్ చెయ్యడంవల్లే ఈ పాట ఆ రేంజి హిట్టయ్యిందంటున్నాడు ప్రదీప్. యూట్యూబ్‌లో జనవరి 31న రిలీజైన ఈ పాటకు ఇప్పటికే 9.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

"అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాల్లో 'మనం' నా ఆల్ టైం ఫేవరేట్. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'టెంపర్' సాంగ్స్ కూడా చాలా ఇష్టం. అలాంటి అనూప్ నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం నేను ఊహించలేదు. లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు 'నీలి నీలి ఆకాశం' పాటను రాసిన విధానం అద్భుతం. అది ఆయన పెన్నులోని మ్యాజిక్ కాదు, ఆయన మనసులోని మ్యాజిక్. ఆ పాటను సిద్ శ్రీరామ్, సునీత అద్భుతంగా పాడారు. ఇన్‌స్టాగ్రాంలో, ట్విట్టర్లో, టిక్ టాక్‌లో.. ఇలా ప్రతిచోటా ఈ సాంగ్ సెన్సేషనల్ అవడం హ్యాపీ. ఒక్క టిక్ టాక్‌లో ఈ పాటపై ఒక లక్ష వీడియోలు పైగా వచ్చి ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్ వీడియో చూసి, అద్భుతంగా ఉందని మెచ్చుకొని, తన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రాంలో లాంచ్ చేసిన మా సూపర్ స్టార్ మహేశ్ గారికి స్పెషల్ థాంక్స్. ఇంతకంటే బిగ్గెస్ట్ లాంచ్ నా లైఫ్‌లో మళ్లీ రాదనుకుంటా. ఆయన లాంచ్ చెయ్యడం వల్ల ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకు ఈ సాంగ్ వెళ్లింది. 'నీలి నీలి ఆకాశం' పాటను సగం రాజమండ్రిలో, సగం కేరళలో షూట్ చేశాం" అని చెప్పాడు ప్రదీప్.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com