
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఓ సుకుమారి' డిజిటల్ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ హ్యూమరస్ ఫ్యామిలీ డ్రామా.. జులై 17న థియేటర్లలోకి వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రియులను నవ్వించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
ఈ కథ విషయానికి వస్తే, ఊరి సర్పంచ్ కావాలని కలలు కనే యాదగిరి (తిరువీర్) చుట్టూ తిరుగుతుంది. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు. యాదగిరి తాత తన ఆస్తి దక్కాలంటే ఒక వింత కండీషన్‌తో వీలునామా రాస్తాడు. అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరికి ముందుగా మగబిడ్డ పుడితే వారిదే ఆస్తి అని రాస్తాడు. ఈ క్రమంలోనే పక్క ఊరి అమ్మాయి దామిని(ఐశ్వర్య రాజేష్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు యాదగిరి. అయితే ఆమెను ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. ఆ విషయం తెలియక యాదగిరి పెళ్లి చేసుకుంటాడు. అసలు దామినిని ముట్టుకుంటే షాక్ ఎందుకు కొడుతుంది? అలా షాక్ కొట్టే అమ్మాయితో యాదగిరి కాపురం ఎలా చేశాడు? తాత ఆస్తి ఎవరికి దక్కింది? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

Oh Sukumari, OTT Release, Thiruveer, Aishwarya Rajesh





