ధనుష్ 'సార్' రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Sep 19, 2022
ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'సార్' (తమిళంలో 'వాతి') ద్విభాషా చిత్రం విడుదల తేదీ ఖరారయ్యింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ సోమవారం తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసి, Mark the Date. Our #Vaathi / #SIR is getting ready to take classes from 2nd Dec 2022! అంటూ రాసుకొచ్చింది.
భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీత దర్శకుడు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య (త్రివిక్రమ్ భార్య) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ధనుష్ మునుపటి మూవీ 'తిరుచిత్రాంబళమ్' తమిళంలో ఘన విజయం సాధించగా, తిరు పేరుతో రిలీజ్ చేసిన తెలుగు వెర్షన్ ఓ మోస్తరుగా ఆడింది. తెలుగులోనూ ధనుష్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ ఉండటంతో ఇప్పుడు తెలుగు నిర్మాతలు అతనితో నేరుగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో 'సార్' (వాతి) మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అతను బాలగంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
మరోవైపు 'తొలిప్రేమ'తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి విజయం సాధించిన నటుడు వెంకీ అట్లూరి, ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' సినిమాలతో ఫ్లాపులు చూశాడు. 'సార్'తో బ్లాక్‌బస్టర్ కొడతాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు.
Also Read