
-కనివిని ఎరుగని కలెక్షన్స్ సునామిలో అబ్సెషన్
-ఇది అబ్సెషన్ యుగమా!
-ఇండియాలోను 100 కోట్ల క్లబ్ లోకి
-నోరెళ్ళబెడుతున్న ట్రేడ్ వర్గాలు
చిత్ర సీమలో ఒక్కోసారి ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. ఇందుకు హాలీవుడ్ మినహాయింపు కాదు. ఎలాంటి భారీ అంచనాలు, స్టార్ కాస్ట్ లేకుండా కేవలం కంటెంట్‌ని నమ్ముకుని వచ్చిన హాలీవుడ్ చిత్రం 'అబ్సెషన్' ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. 1 మిలియన్ డాలర్ కంటే తక్కువ బడ్జెట్‌తో, అంటే సుమారు 6.2 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సృష్టిస్తున్న రికార్డు ప్రపంచ సినీ మేధావులు నోరెళ్లబెడుతున్నారు.
ప్రముఖ మాజీ యూట్యూబర్ బార్కర్ దర్శకత్వంలో మే 29 న విడుదలవ్వగా కేవలం 26 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 234.5 మిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా 2240 కోట్ల రూపాయలు. ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేవలం 15 మిలియన్ డాలర్లకి ఫోకస్ ఫీచర్స్ కొనుగోలు చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ఆ సంస్థ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో గతంలో ఉన్న 'డౌన్‌టన్ అబ్బే' 194.7 మిలియన్ డాలర్లు రికార్డుని సులువుగా బ్రేక్ చేసింది. ఈ చిత్రం కేవలం అమెరికాలోనే కాకుండా భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని రీతిలో వీరవిహారం చేస్తోంది. మే 29 నే విడుదలవ్వగా మొదటి రోజు 1.50 కోట్ల రూపాయల స్వల్ప వసూళ్లనే సాధించింది. అయితే మౌత్ టాక్ కారణంగా కేవలం 17 రోజుల్లోనే 76.75 కోట్ల రూపాయల నెట్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. మొదటి వారం ముగిసేసరికి ఇండియాలో 21.85 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, రెండవ వారంలో మరింత పుంజుకుని ఏకంగా 31.28 కోట్ల రూపాయలను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also read: Bandla Ganesh: పవన్ స్పూర్తితో తెలంగాణ నిరంజన్‌కి బండ్ల గణేష్ భారీ ఆర్థికసాయం
సాధారణంగా హారర్ సినిమాలు రెండవ వారంలో డ్రాప్ అవుతాయి, కానీ అబ్సెషన్ చిత్రం మాత్రం మొదటి వీకెండ్ కలెక్షన్లు 7.45 కోట్ల రూపాయలు దాటి, రెండవ వీకెండ్ కి రికార్డ్స్ వసూళ్లు రాబట్టడం విశేషం. త్వరలోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కథ విషయానికి వస్తే మ్యూజిక్ షాప్‌లో పనిచేసే యువకుడు ఒక అతీత శక్తులున్న బొమ్మ ద్వారా తన స్నేహితురాలిని ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత ఆమె తన స్వభావాన్ని కోల్పోతూ సైకోగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే చిత్ర కథ.





