Home

»

Latest News

`ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ లో శివాజీ హీరోయిన్!

Sep 15, 2021 12:28PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన యాక్ష‌న్ డ్రామా `ఛ‌త్ర‌ప‌తి` (2005).. ప‌ద‌హారేళ్ళ త‌రువాత బాలీవుడ్ బాట ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్, స్టార్ కెప్టెన్ వీవీ వినాయ‌క్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే హిందీనాట తొలి అడుగేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో నుస్ర‌త్ బ‌రుచా నాయిక‌గా ఎంపికైంద‌ట‌. అంతేకాదు.. ఇప్ప‌టికే రెండు రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ లో నుస్ర‌త్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.

`ప్యార్ కా పంచ్ నామా 2` (2015), `సోనూ కే టిటూ కీ స్వీటీ` (2018) చిత్రాల‌తో బాలీవుడ్ లో యాక్ట్ర‌స్ గా మంచి గుర్తింపు పొందిన నుస్ర‌త్.. త‌న కెరీర్ ఆరంభంలో శివాజీకి జోడీగా `తాజ్ మ‌హ‌ల్` (2010) అనే తెలుగు సినిమా చేసింది. అందులో శ్రుతి అనే స్క్రీన్ నేమ్ తో ఈ టాలెంటెడ్ బ్యూటీ అల‌రించింది. ఆపై మ‌ళ్ళీ తెలుగు తెర‌పై క‌నిపించ‌ని ఈ అమ్మ‌డు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో న‌టిస్తున్న బాలీవుడ్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. మ‌రి.. నుస్ర‌త్ కాంబినేష‌న్  బెల్లంకొండ బాబుకి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com