Home

»

Latest News

‘డ్రాగన్’ కథ వెనుకున్న మిస్టరీ ఇదే.. ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్.. ఆ పాత్రను సీక్రెట్‌గా ఉంచారు.!

Jul 6, 2026 4:26PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే రికార్డు స్థాయి అంచనాలు నెలకొనగా, ఇటీవల విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఈ గ్లింప్స్‌లో యాక్షన్ ఎలివేషన్లు, ప్రశాంత్ నీల్ మార్క్ విజువల్స్ చూపించినప్పటికీ అసలైన కథను ఎక్కడా రివీల్ చేయకుండా దాచేయడం హాట్ టాపిక్‌గా మారింది. డ్రగ్ మాఫియా నేపథ్యాన్ని గ్లింప్స్‌లో చూపించారు కానీ, అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది.

సాధారణంగా ఈ రోజుల్లో సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ లేదా టీజర్స్ లోనే సగం కథను హింట్ ఇచ్చేస్తుంటారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన ఫార్ములాను ఫాలో అవుతున్నారు. సినిమాలోని మెయిన్ పాయింట్‌ను పూర్తిగా సస్పెన్స్‌గా ఉంచడం ద్వారా ప్రేక్షకుల క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. గ్లింప్స్ ద్వారా ఆ సినిమా ప్రపంచం ఎలా ఉంటుంది, అందులోని క్యారెక్టర్స్ షేడ్స్ ఏంటి అనేది మాత్రమే చూపించారు తప్ప, అసలు కథ దేని చుట్టూ తిరుగుతుంది అనే సీక్రెట్‌ను చాలా జాగ్రత్తగా దాచేశారు. ఈ హై-లెవెల్ మార్కెటింగ్ టూల్ ఇప్పుడు 'డ్రాగన్' సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది.

ఇక ఈ సస్పెన్స్ డ్రామాలో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్న అంశం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ క్యారెక్టర్. ఈ సినిమాలో కృతి సనన్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, సినిమాలోని మెయిన్ కథను మలుపు తిప్పే కీలకమైన లింక్ ఆమె పాత్రతోనే ముడిపడి ఉంటుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. అందుకే 'డ్రాగన్' టీమ్ ఆమె లుక్‌ను గానీ, పాత్ర స్వభావాన్ని గానీ ఎక్కడా బయటపెట్టడం లేదు. ఈ బాలీవుడ్ భామ రోల్ చుట్టూ మెయింటైన్ చేస్తున్న ఈ మిస్టరీ స్ట్రాటజీ నార్త్ బెల్ట్‌లో కూడా సినిమాకు ఊహించని రేంజ్ క్రేజ్ తెచ్చిపెడుతోంది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనగానే మనకు మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్స్ గుర్తొస్తాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఒక భారీ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను నీల్ డిజైన్ చేశారట.ఈ ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ టాక్. ఈ మాస్ ఎలివేషన్లతో పాటు, ప్రశాంత్ నీల్ రెగ్యులర్ డార్క్ షేడ్స్‌కు భిన్నంగా ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం చాలా కలర్‌ఫుల్‌గా, భారీ ఎమోషనల్ డ్రామాతో ఉండబోతున్నాయనే సరికొత్త అప్‌డేట్ ఫ్యాన్స్‌కు మరింత జోష్ ఇస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వండర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్, రవి బస్రూర్ సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అన్నింటికీ మించి కృతి సనన్ పాత్ర చుట్టూ ఉన్న ఈ సస్పెన్స్ ఎలిమెంట్స్ గనుక థియేటర్లలో పక్కాగా వర్కవుట్ అయితే, బాక్సాఫీస్ దగ్గర 'డ్రాగన్' సృష్టించే విధ్వంసాన్ని ఆపడం ఎవరి తరం కాదనేది మాత్రం వాస్తవం.

 

 

Jr NTR, Prashanth Neel, Dragon, Interval Block, Kriti Sanon

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com