Home

»

Latest News

డ్రాగన్ అప్డేట్: షూటింగ్ రీస్టార్ట్, రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్.!

Sep 2, 2026 7:12PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు.

తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. 

 

 

 

[Dragon, Jr NTR, Prashanth Neel, NTR Neel, Irumudi, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com