
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్ తొలిసారి ఆయనతో జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఉంది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల మూడో వారంలో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ముందుగా ఒక గ్రాండ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారట. ఆ వెంటనే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ టీమ్ రెడీ అవుతోందని టాక్.
ఇప్పటికే ‘డ్రాగన్’ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్‌పై యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించిన విషయం తెలిసిందే. గతంలో యూరోపియన్ స్టైల్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈసారి ప్లాన్ చేస్తున్న యాక్షన్ బ్లాక్ మరింత స్పెషల్‌గా ఉండబోతుందట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో ఈ ఫైట్‌ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ మేకింగ్, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిసి వస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదనే టాక్ వినిపిస్తోంది.
ఇక ‘డ్రాగన్’లో జైల్ ఫైట్, కాళీమాత టెంపుల్ ఫైట్ లాంటి భారీ యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: ‘స్పిరిట్’ స్టోరీ లీక్.. రెండు డిఫరెంట్ లుక్స్‌లో ప్రభాస్ ఊచకోత.!
[Dragon Massive Action Schedule, NTR Dragon Shooting Update, NTR Dragon Fights, NTR Dragon Action Scenes, Jr NTR Dragon Movie, NTR Neel Movie, Prashanth Neel, Telugu Film News]





