Home

»

Latest News

తార‌క్.. కెరీర్‌లో తొలి డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టేనా!?

Jan 24, 2022 3:35PM

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. చిన్న వ‌య‌సులోనే స్టార్ డ‌మ్ చూసిన వైనం తార‌క్ సొంతం. అలాగ‌ని కెరీర్ ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సంద‌ర్భాలైతే తార‌క్ కి లేవ‌నే చెప్పాలి.  హీరోగా కెరీర్ ని ప్రారంభించిన దాదాపు తొమ్మిదేళ్ళ త‌రువాత `అదుర్స్`, `బృందావ‌నం` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు ఎన్టీఆర్. ఇక `బృందావ‌నం`  త‌రువాత వ‌చ్చిన అర‌డ‌జ‌ను సినిమాల్లో (`శ‌క్తి`, `ఊస‌ర‌వెల్లి`, `ద‌మ్ము`, `బాద్ షా`, `రామ‌య్యా వ‌స్తావ‌య్యా`, `ర‌భ‌స‌`) ఒక్క `బాద్ షా` మాత్ర‌మే బాక్సాఫీస్ ని మెప్పించింది.

అయితే, `టెంప‌ర్` నుంచి  మాత్రం జూనియ‌ర్ ట్రాక్ రికార్డ్ పూర్తిగా మారిపోయింది. `టెంప‌ర్`, `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్`, `జై ల‌వ కుశ‌`, `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`.. ఇలా ఐదు `నాన్ - ఫెయిల్యూర్` సినిమాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు తార‌క్. అలాగే, ఈ ఐదు చిత్రాల్లోనూ పొంత‌న లేని పాత్ర‌లు పోషించి మెప్పించారు. క‌ట్ చేస్తే.. మూడేళ్ళ‌కు పైగా విరామంతో ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి `ఆర్ ఆర్ ఆర్` మూవీ రాబోతోంది. మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌పైకి రానున్న‌ట్లు తాజాగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌రి.. `ఆర్ ఆర్ ఆర్`తో వ‌రుస‌గా ఆరో విజ‌యాన్ని అందుకుని.. తార‌క్ త‌న కెరీర్ లో తొలి డ‌బుల్ హ్యాట్రిక్ కొడ‌తారేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com