Home

»

Latest News

మే 20న 'NTR30' ఫస్ట్ లుక్!

May 10, 2022 12:32PM

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి త్వరలో ఓ సర్ ప్రైజ్ రానుందని తెలుస్తోంది.

మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో ఆరోజు 'NTR30' అప్డేట్ రానుందని సమాచారం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో తారక్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని, లుక్ కూడా గత చిత్రాలకు భిన్నంగా ఉండనుందని అంటున్నారు. లుక్ కి సంబంధించి ఇప్పటికే ఫోటోషూట్ కూడా జరిగిందని టాక్. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ కానుందని సమాచారం.

మరోవైపు తారక్ బర్త్ డేకి 'NTR31' అప్డేట్ కూడా వచ్చే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ అధికారిక ప్రకటన మే 20న రానుందని తెలుస్తోంది. ప్రభాస్ తో చేస్తున్న 'సలార్' షూటింగ్ పూర్తయ్యాక ఈ మూవీ పట్టాలెక్కనుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com