Home

»

Latest News

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా:ఇయర్ ఎండ్ లో థియేటర్లని షేక్ చేయనున్న చిత్రాలు ఇవే!

Nov 11, 2026 11:53AM

 

మామూలుగానే కాలం పరిగెడుతుంది. నెలలు రోజులా అయిపోతున్నాయి. మరి సినీ ప్రేమికుల ముందు కాలం ఇంకెంత వేగంగా పరిగెడుతూ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సినీ ప్రేమికులు ఇప్పుడు ఇయర్ ఎండ్ లో వాళ్ళని షేక్ చేసే చిత్రాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఆ ఆలోచనలలో భాగస్వామ్యం అవుతారా!

ఈ ఏడాది చివరి రెండు నెలలు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రసీమలకు అసలైన పరీక్షా సమయంగా మారాయి. నవంబర్ మరియు డిసెంబర్ మాసాలలో ఏకంగా పదుల సంఖ్యలో భారీ బడ్జెట్ చిత్రాలు, క్రేజీ ప్రాజెక్ట్‌లు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో సినీ ప్రియులకు నూతన వినోదాల విహారం ప్రారంభమైంది.

సాధారణంగా ఈ సీజన్‌ను ‘అన్‌సీజన్’ అంటుండే టాలీవుడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ, ఎండాకాలం మరియు దసరా పండగలను మించిన పోటీ ఈసారి నెలకొంది. స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వరుస కడుతుండటంతో థియేటర్ల వద్ద సందడి తారాస్థాయికి చేరింది. నవంబర్ 19న యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ సీక్వెల్‌తో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ బాక్సాఫీస్ రయ్‌మనిపించేందుకు సిద్ధమవుతున్నారు. 

మరుసటి రోజు నవంబర్ 20న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సైతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ఇక డిసెంబర్ మాసానికి వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత ముదురుతోంది. క్రిస్మస్ పండగను టార్గెట్ చేస్తూ డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా ’ భారీ అంచనాల నడుమ విడుదలవుతోంది. డిసెంబర్ 13 నుంచే ఈ చిత్రానికి సంబంధించిన ‘డాడా ధమాకా’ ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌ను ఊపేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మూవీ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం: అక్కడ ఇక బంద్!
 

ఇదే డిసెంబర్ 24న కింగ్ నాగార్జున ‘కింగ్ 100’ సినిమాతో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ చిత్రం కూడా బరిలో దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.హాలీవుడ్ నుంచి ‘అవెంజర్స్: డూమ్‌డే’ (Avengers: Doomsday), ‘డూన్: పార్ట్ త్రీ’ (Dune: Part Three) మరియు ‘జుమాజి: ఓపెన్ వరల్డ్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు డిసెంబర్ 18 మరియు 25 తేదీలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయడానికి ముస్తాబవుతున్నాయి. ఈ విపరీతమైన పోటీలో ఏ సినిమాలు విజయతీరాలకు చేరతాయి, ఏ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయనేది వేచి చూడాలి.భోగి నవంబర్ 12 న వాయిదా పడినా కొత్త డేట్ ఈ ఏడాదే ఉంటుంది.

ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నితేశ్‌ తివారీ తెరకెక్కించిన గ్లోబల్ లెవెల్ మైలాజికల్ డ్రామా ‘రామాయణం: పార్ట్ 1’ నవంబర్ 5న విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉంది. సూర్య ‘సీన్ కూడా తగ్గేదెలే అనే విధంగా బాక్స్ ఆఫీస్ ని మెస్మరైజ్ చేసి పడేస్తుంది.

 

మీకు నచ్చవచ్చు : దాదా ధమాకా!
మీకు నచ్చవచ్చు : స్టార్ హీరోయిన్ సంచలనం!

[November And December 2026 Biggest Telugu Bollywood And Hollywood Releases, Tollywood upcoming movies, December 2026 releases, Balakrishna Dada, Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com