Home

»

Latest News

`భీష్మ` సెట్స్ మీదకు వెళ్తున్నాడు!!

Feb 12, 2019 4:06PM

 యంగ్ హీరో నితిన్ హీరోగా `ఛ‌లో` ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల డైర‌క్ష‌న్ లో ఒక సినిమా ప్రారంభం కానున్న విష‌యం తెలిసింది. `భీష్మ‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ లో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక  మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.  కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయ‌ని తెలిసింది. అంతేకాదు ఆ రోజు  నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో యూనిట్ ఉంద‌ట‌. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి జూలైలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెలువ‌డుతాయి. `అ ఆ ` త‌ర్వాత స‌రైన విజ‌యం లేని నితిన్ కి ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది. మ‌రి `భీష్మ‌` తోనైనా నితిన్ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో  చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com