పవన్ కళ్యాణ్ తో పోటీపడుతున్న నితిన్..టైం అంటే ఇదే
on Jan 18, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లిస్ట్ లో ఉన్న సినిమాల్లో నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోయే ఫస్ట్ మూవీ హరిహరవీరమల్లు(Hariharaveeramallu).చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథ కావడం,పైగా పవన్ పోరాటయోధుడుగా కనిపిస్తుండంతో వీరమల్లుపై పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.రీసెంట్ గా 'మాట వినాలి' అనే సాంగ్ కూడా రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలని పెంచేసిందని చెప్పవచ్చు.పైగా ఈ సాంగ్ ని పవన్ స్వయంగా పాడటం విశేషం.
ఇక ఈ మూవీ మార్చి 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఈ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ చెప్పడంతో పాటుగా,ప్రచార చిత్రాల్లో కూడా మార్చి 28 నే అని వేస్తున్నారు.ఇప్పుడు ఇదే డేట్ కి నితిన్(Nithiin)కొత్త మూవీ 'రాబిన్ హుడ్' విడుదల కానుంది.ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి పోస్టర్ తో కూడిన అధికార ప్రకటన వచ్చింది.నితిన్ కి భీష్మతో మంచి విజయాన్నిఅందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ,నిజానికి గత ఏడాది డిసెంబర్ 25 న రిలీజ్ కావాల్సింది.ఆ తర్వాత ఏప్రిల్ 10 న రిలీజ్ డేట్ ఉంటుందనే ప్రచారం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అందరి అంచనాలని తలకిందులు చేస్తు మార్చి 28 న రిలీజ్ కానుంది.
పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి ఎంత ఇష్టమో అందరకి తెలిసిందే.పవన్ కి ఉన్న అనేక మంది వీరాభిమానుల్లో నితిన్ కూడా ఒకడు.పవన్ అభిమానుల్లోకూడా చాలా మంది నితిన్ ని అభిమానిస్తారు.ఈ నేపథ్యంలో పవన్ తో నితిన్ పోటీపడటంపై ఇరువురి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
