Home

»

Latest News

నితిన్-సితార కాంబో మూవీ లాంచ్.. ఈసారైనా హిట్ కొడతాడా?

May 06, 2026

హీరో నితిన్ (Nithiin) తన తదుపరి సినిమాని అధికారికంగా ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ, నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. 

ఈ చిత్రానికి దర్శక ద్వయం నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సరసన హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తోంది. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మదాడి, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా జానీ షేక్ పని చేస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. 

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

భీష్మ, రంగ్‌దే తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నితిన్ చేస్తున్న సినిమా ఇది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com