మెగా ప్రిన్సెస్ నీహారిక ' ఒక మనసు ' ఫస్ట్ లుక్..!
on Apr 9, 2016
మెగావారమ్మాయి నీహారిక మొదట యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసి, అభిమానుల్ని సంపాదించుకుంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తాజాగా ఆమె నటిస్తున్న ఒక మనసు సినిమా పోస్టర్ రిలీజైంది. నాగశౌర్య హీరోగా చేస్తున్న ఈ మూవీని, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఫేం రామరాజు డైరెక్ట్ చేస్తున్నారు. మథుర శ్రీథర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ చివరిలో ఆడియో లాంఛ్ నిర్వహించబోతున్నారు. టాలీవుడ్ సినీ ఫ్యామిలీల్లో, అక్కినేని సుప్రియ, మంచు లక్ష్మిల తర్వాత వస్తున్న అమ్మాయి నీహారికే కావడం విశేషం. నాగబాబు తనయ నటించిన ఈ సినిమా పట్ల ప్రస్తుతం మంచి అంచనాలే ఉన్నాయి. చూడగానే ఫీల్ గుడ్ మూవీ అని అనిపిస్తున్న ఒక మనసు ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. పోస్టర్లో మెగా ప్రిన్సెస్ నీహారిక అని వేయడం విశేషం.