మెగా డాటర్ మ్యారేజ్‌కు రెడీ!!!
on Feb 13, 2019

ఇటీవల కాలంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు మెగాబ్రదర్ నాగబాబు. ఇలాంటి సమయంలో మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు నాగబాబు. తన కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు ఈయన . ఒకటి కొడుకు వరుణ్ తేజ్ అయితే మరోటి కూతురు నిహారికది. వరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు నిహారిక పెళ్లి గురంచి చర్చలు మొదలయ్యాయి. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి కానీ అవి అబద్దమని వాళ్లే తేల్చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగబాబు కూడా నిహారిక పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు. నిహారిక సినిమాలోకి వచ్చేటప్పుడే అవసరమా అని అడిగానని ఖచ్చితంగా నటిస్తానని మొండికేయడంతో కాదనలేకపోయానంటున్నాడు మెగా బ్రదర్.
వెబ్ సిరీస్ లలో నటిస్తుంటే ఓకే చెప్పానంటున్నాడు నాగబాబు. రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తానని ముందే నిహారికకు చెప్పానని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. ఇప్పుడు ఆ టైమ్ పూర్తి కావడంతో మంచి వరున్ని వేతికే పనిలో ఉన్నాడు ఈయన. తమకు కులం పట్టింపులు లేవని. మంచి కుర్రాడైతే చాలంటున్నాడు నాగబాబు. తమ కులంలోనే మంచి కుర్రాడు దొరికితే మంచిదే. లేకపోయినా మరో కులం అబ్బాయిని అల్లుడిగా చేసుకుంటాను అంటున్నాడు ఈయన. అన్ని కులాలను గౌరవించడం మన బాధ్యత అంటున్నాడు ఈయన. మొత్తానికి ఇప్పుడు నాగబాబు ఇచ్చిన క్లారిటీతో నిహారిక పెళ్లి కూతురు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందని అర్థమైపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



