
మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ గా కావాల్సినదానికంటే కాస్త ఎక్కువ పబ్లిసిటీ దక్కించుకొన్న కొణిదెల కుమార్తె నీహారికకు పరిచయ చిత్రం "ఒక మనసు" ఆశించిన స్థాయి గుర్తింపు కానీ విజయాన్ని కానీ అందించలేకపోయింది. అందుకే బోలెడు అవకాశాలు వచ్చినప్పటికీ.. చాలా సెలక్టెడ్ గా స్క్రిప్ట్ లు ఎంచుకోంటోంది. "ఒక మనసు" విడుదలయ్యాక మెగాభిమానులందరూ ముక్త కంఠంతో నీహారికకు చెప్పింది ఒకటే.. "ఇలాంటి బరువైన పాత్రలు కాకుండా సరదా క్యారెక్టర్లు చేయమ్మా" అని. దాంతో "హ్యాపీ జర్నీ" అనే కన్నడ సినిమా రీమేక్ ను తన సెకండ్ సినిమాగా ఎంచుకొందట నీహారిక. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎవరు నిర్మిస్తారు? అనే విషయం తెలియదు కానీ.. నీహారిక దెయ్యం పాత్రలో కనిపించనుందని, నీహారికకు అన్నగా హర్షవర్ధన్ రాణే కనిపించనున్నాడని సమాచారం.




.jpg)
