Home

»

Latest News

'ఎఫ్ 3'కి కొత్త రిలీజ్ డేట్‌.. ఏప్రిల్ నుంచి మేకు వాయిదా!

Feb 14, 2022 10:16AM

 

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టిస్తోన్న 'ఎఫ్ 3' మూవీకి కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించిన తేదీతో పోలిస్తే కొత్త రిలీజ్ డేట్ నెల రోజులు వాయిదాప‌డింది. ఇదివ‌ర‌కు ఏప్రిల్ 28న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నిర్మాత‌లు, ఇప్పుడు ఆ విడుద‌ల తేదీని మే 27కు మార్చారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో త‌మ‌న్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల పెద్ద సినిమాల విడుద‌ల విష‌యంలో అనిశ్చితి నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అందుకే పెద్ద సినిమాల నిర్మాత‌లు రెండేసి విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ ధ‌ర‌ల విష‌యంలో కొత్త జీవో కోసం ఎదురుచూస్తున్న నిర్మాత‌లు త‌మ సినిమాల విడుద‌ల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. థ‌ర్డ్ వేవ్ ముగింపుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఏపీలో కొవిడ్ నిబంధ‌న‌లు ఇంకా అమ‌లులోనే ఉన్నాయి. ఈ వారంలో కొత్త నియ‌మ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు. 

మే 27 నాటికి అన్ని అంద‌రు విద్యార్థుల ప‌రీక్ష‌లు పూర్త‌యిపోయి, పూర్తిగా స‌మ్మ‌ర్ వెకేష‌న్ మూడ్‌లో ఉంటారు కాబ‌ట్టి, ఆ తేదీ అయితే ప‌ర్ఫెక్టుగా ఉంటుంద‌నే ఉద్దేశంతో 'ఎఫ్ 3' నిర్మాత‌లు కొత్త‌గా ఆ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ మూవీలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సునీల్ కీల‌క పాత్ర‌లు చేస్తుండ‌గా, మూడో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ క‌నిపించ‌నుంది. ఆమె సినిమాకు మ‌రింత గ్లామ‌ర్‌ను అద్ద‌నుంద‌ని యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు.

దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు సాయిశ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com