Home

»

Latest News

'అల్లూరి'గా రామ్ చరణ్ గర్జన!

Dec 06, 2021

మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ డిసెంబర్ 9 న విడుదల కానుంది. ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులలో ఉత్సాహం నింపడం కోసం మేకర్స్ పోస్టర్స్ ను విడుదల చేశారు. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఈ ఉదయం భీమ్ పోస్టర్ విడుదల కాగా, తాజాగా రామ్ పోస్టర్ విడుదలైంది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 9 న ట్రైలర్ విడుదల కానుంది. ఈ క్రమంలో మూడు రోజుల్లో ట్రైలర్ రాబోతుందని తెలియజేస్తూ తాజాగా 'రామ్' పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. సిక్స్ ప్యాక్ బాడీతో, సింహం గర్జిస్తున్నట్లుగా ఉన్న చరణ్ లుక్ ఆకట్టుకుంటోంది.

Also Read: 'ఆర్ఆర్ఆర్' సర్ ప్రైజ్.. గోండు బెబ్బులి లుక్ అదిరింది!

డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ కి జోడీగా అలియా భట్, తారక్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందు రానుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com