Home

»

Latest News

ఏప్రెల్ 10 న రానా, ఇలియానా నేను - నారాక్షసి ఆడియో

Apr 6, 2011 12:12PM

ileana hot wallpapers, ileana hot stills, ileana hot images, ileana hot pics, ileana hot photos, ileana hot picturesఏప్రెల్ 10 న రానా, ఇలియానా "నేను - నా రాక్షసి" ఆడియో రిలీజ్ కానుంది. వివరాల్లోకి వెళితే యువ హీరో దగ్గుబాటి రానా హీరోగా, నలక నడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువ నిర్మాత నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "నేను- నా రాక్షసి". ఈ చిత్రం ఆడియోని ఏప్రెల్ పదవ తేదీన హైదరాబాద్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ రానా, ఇలియానా "నేను - నా రాక్షసి"చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు బాపి-టుటుల్ సంగీతాన్నందించారు.


ఈ రానా, ఇలియానా "నేను - నా రాక్షసి" చిత్రం ఆడియో రిలీజ్ రోజునే నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూండగా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్న "100% లవ్" చిత్రం ఆడియో విడుదల కూడా జరుగనుంది. ఈ "100% లవ్" చిత్రానికి యువసంగీత తరంగం దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అలాగే ఈ రానా, ఇలియానా "నేను - నా రాక్షసి", నాగచైతన్య "100% లవ్" చిత్రాలు రెండూ కూడా ఏప్రెల్ 29 వ తేదీనే విడుదలవుతున్నాయి. మరి ఈ బావ బావమరుదుల్లో ఎవరి సినిమా హిట్టవుతుందో...? ఎవరు గెలుస్తారో...? కాలమే చెప్పాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com