
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK 111' చిత్రంపై తెలుగు సినీ వర్గాల్లో, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా 2026 అక్టోబర్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. కానీ, షూటింగ్ ఆలస్యమవ్వడంతో డిసెంబర్ కి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగానే దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
'NBK 111' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే కాకినాడలో ఒక భారీ షెడ్యూల్ జరగనుంది. ఆ షెడ్యూల్ సినిమాకు కీలకమైన పవర్ ఫుల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేయనున్నారట. కాకినాడ షెడ్యూల్ తో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని వినికిడి.
'NBK 111' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్, క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన బర్త్‌డే గ్లింప్స్ స్పష్టం చేసింది. అందులో బాలయ్య స్టైలిష్ ఎనర్జీ, ఎలెక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది.





