Home

»

Latest News

నేను మదర్ థెరీసాని కాదు.. అయితే ఏంటి?.. నయన్ కీలక వ్యాఖ్యలు!

Nov 18, 2026 3:58PM


సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్ గా నయనతార కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ తెలిసిందే. రీసెంట్ గా 'మహాశక్తీ' తో థియేటర్స్ లోకి వచ్చింది. ఇక కొన్ని రోజుల క్రితం ధనుష్, నయన్ కి మధ్య నడిచిన వివాదం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది. 


నయనతార వివాహ వేడుకల విశేషాలతో ప్రఖ్యాత ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టెయిల్" డాక్యుమెంటరీ ప్రకంపనలు సృష్టించింది. ఈ డాక్యుమెంటరీలో ఆమె కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి అత్యంత కీలకమైన 'నేను రౌడీనే' సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్, క్లిప్స్ ఉపయోగించడంతో అసలు వివాదం రాజుకుంది. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరించగా, ఆ సినిమాలోని కేవలం 3 సెకన్ల చిన్న బిహైండ్-ది-సీన్స్ (BTS) క్లిప్ వాడినందుకు గాను ధనుష్ వర్గాల నుంచి ఏకంగా రూ. 10 కోట్ల భారీ నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు రావడం కలకలం రేపింది.

 

అసలు నయనతార జీవితంపై డాక్యుమెంటరీ చేయాల్సిన అవసరం ఏముందని కొంత మంది మాట్లాడుతున్న మాటలపై నయన్ తాజాగా స్పందించింది. నా జీవితంపై ఎందుకు డాక్యుమెంటరీ చెయ్యకూడదు. నేను మదర్ థెరిసా, స్వతంత్ర సమరయోధురాలని కాదు. మీరు ఊహించే గొప్ప బిరుదులకి అర్హురాలని కాకపోవచ్చు

.ఒక చిన్న గ్రామం నుంచి  ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకి వచ్చి సాధించిన విజయాలను చూసి ఓర్వలేకపోవడం తగదని ఆమె మండిపడ్డారు. వేదికలెక్కి నీతి సూక్తులు వల్లించే వ్యక్తులు, వ్యక్తిగతంగా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని ఆమె తీవ్రంగా విమర్శించారు. తాము ఆ డాక్యుమెంటరీ కోసం ఒరిజినల్ సాంగ్స్ మరియు విజువల్స్ ఉపయోగించేందుకు ఎన్‌ఓసీ (NOC) కోరినా ఇవ్వలేదని, చివరికి తాము సొంత ఫోన్లలో రికార్డు చేసుకున్న 3 సెకన్ల చిన్న వీడియో క్లిప్‌ను వాడుకుంటే కోట్లలో లీగల్ నోటీసులు పంపడం అత్యంత క్షీణించిన ప్రవర్తన అని ఆమె ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి:ధనుష్ ఫ్యాన్స్ vs అనిరుద్: లైఫ్ ఇచ్చినోడినే మర్చిపోయావా?

ఎదుటివారి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవాలని, ఈ ప్రపంచం అందరిదీ అని పేర్కొంటూ నయనతార తన లేఖలో హితవు పలికారు. కేవలం మూడు సెకన్ల విజువల్స్ కోసం కోట్లు డిమాండ్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల వ్యక్తిగత ఇగోలు బయటపడతాయని ఆమె ఘాటుగా స్పష్టం చేశారు.

ఈ డాక్యుమెంటరీ వివాదం కోర్టుల వరకు వెళ్లడమే కాకుండా, సినిమా రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత కాపీరైట్ హక్కులు మరియు కంటెంట్ వాడకంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ విశ్లేషకుల వరకు అందరూ ఈ వివాదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చారు. మొత్తానికి వివాదాల నడుమ విడుదలైన ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ డిజిటల్ మాధ్యమాలలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

 

మీకు నచ్చవచ్చు:వారణాసి తర్వాత మహేష్ సినిమా ఇదే!
మీకు నచ్చవచ్చు:అనుష్క సంచలన నిర్ణయం!

 

[Nayanthara, Dhanush,  Naanum Rowdy Dhaan, Tollywood, Vijay Sethupathi]



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com