Home

»

Latest News

భర్తని అవమానించిన స్టార్ హీరో పై పగ తీర్చుకున్న నయన!

Feb 14, 2023 1:22PM

ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలో ఇంకా చెప్పాలంటే ఇండియాలో కూడా లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే నయనతార పేరే చెబుతారు.  ఫిలిం మేకర్స్ కి ఆమె అంటే భయం. ఆమె పెట్టే కండిషన్లన్నీటికి వారు ఒప్పుకుంటారు. ఆమె ఆడిందే ఆట పాడిందే పాట‌గా ఆమె హ‌వా సాగుతోంది.  ఆమె ఏం చెబితే అదే చెల్లుబాటు అవుతుంది. ఒక స్టార్ హీరోకు ఉన్న కమాండ్ ఈమెకు ఉంది. ఈమె  గీసిన గీతను ఎవరు జవదాటరు. ఈమె ప్రమోషన్స్ కు రాకపోయినా, షూటింగులకు ఎగ్గోటినా ఎదురు తిరిగేవారు ఉండరు. కారణం ఆమెకున్న స్టార్ డం. ముఖ్యంగా  కోలీవుడ్‌లో ఈమె బొమ్మ  పోస్టర్  పై కనిపిస్తే చాలు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఈమె కోసం ప్రేక్షకులు థియేటర్ల వద్దకు క్యూ కడతారు. అంతటి పాపులారిటీ ఈమెకు సొంతం.  

కాగా ఇటీవల ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ను  వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో సహజీవనం చేస్తున్న వీరు ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఇక విషయానికొస్తే తల‌ అజిత్ కుమార్ తునివు చిత్రం తర్వాత ఈమె భర్త విగ్నేశ శివ‌న్ తో ఓ చిత్రానికి ఓకే చెప్పారు.  ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించడానికి సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో భారీ తారగాణంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేశారు. అజిత్ -నయనతార కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వస్తే మూడు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో మరోసారి ఫెయిర్ సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. కానీ అజిత్ అనుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును విగ్నేష్ శివన్ తో కాకుండా మరొకరితో చేస్తున్నారు. విగ్నేశ్  శివ‌న్  చెప్పిన కథను అజిత్ తిరస్కరించారని సమాచారం. దాంతో విగ్నేష్ శివ‌న్ కి  తల అజిత్‌ను దర్శకత్వం వహించే సువర్ణావకాశం మిస్సయింది.

స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాల వల్లనే ఈ విధంగా జరిగింది. కానీ ఈ చిత్రం నుండి తన భర్తను తొలగించడం నయనతారకు అవమానంగా తోచింది. దాంతో ఈ చిత్రం నుంచి ఆమె కూడా తప్పుకుంటున్నట్టు చెప్పేసింది. దాంతో లైకా ప్రొడక్షన్స్ కు ఈమె  షాక్ ఇచ్చింది. ఇక‌పై త‌ల అజిత్ తో  చిత్రాలలో నటించకూడదని నిర్ణయం తీసుకొని కూడా మ‌రో షాక్ పై షాక్  ఇచ్చింది. తన భర్తని అవమానిస్తే తనని అవమానించినట్లేనని నయనతార లైకా ప్రొడక్షన్స్ కు అజిత్ కు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com