త్రిషకు ముద్దు పెట్టేసిన బాలయ్య..!
on Apr 19, 2016
సావిత్రి ఆడియో ఫంక్షన్లో కాస్త టంగ్ స్లిప్ అయిన దగ్గర నుంచీ, నందమూరి బాలకృష్ణ ఏం చేసినా, మీడియా వేయి కళ్లతో అబ్జర్వ్ చేస్తోంది. ఆ ఫంక్షన్లో బాలయ్య వ్యాఖ్యల గురించి నేషనల్ మీడియా సైతం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా చెన్నైలో జరిగిన స్టార్స్ క్రికెట్ మ్యాచ్ లో దమ్ము కొడుతూ బాలయ్య కెమేరాలకు చిక్కారు. దాంతో ఆ అంశాన్ని కూడా ఫుల్లుగా వాడేసుకుంది మీడియా. నిన్న రాత్రి జరిగిన త్రిష నాయకి ఆడియో ఫంక్షన్ కు ఛీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిషను ఆప్యాయంగా కౌగలించుకుని ముద్దు పెట్టారు బాలయ్య. సెలబ్రిటీలు కలిసినప్పుడు ఇలా ఫార్మల్ గా విష్ చేసుకోవడం కామనే. కానీ ఇలాంటి శుభాకాంక్షలను బాలయ్య ఎక్కువ చెప్పరు. సాధారణంగా షేక్ హ్యాండ్ గానీ, నమస్కారం గానీ పెట్టే బాలయ్య, త్రిషకు ముద్దు పెట్టడానికి కారణం వారిద్దరి మధ్యా ఉన్న స్నేహమే అని తెలుస్తోంది. కేవలం లయన్ సినిమాలో మాత్రమే ఇద్దరూ కలిసి పనిచేసినా ఆ ఒక్క సినిమాతోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోయారట. అందుకే త్రిష పిలిచిన వెంటనే కాదనకుండా ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారు బాలయ్య. కాగా, నాయకి ఒక కొత్త టైప్ హర్రర్ మూవీ అని మూవీ టీం చెబుతున్నారు. గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేష్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.