జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న నేచురల్ స్టార్!
on Feb 7, 2023
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'దసరా'. తన కెరీర్లో తొలిసారి ఊర మాస్ పాత్రలో నాని నటిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా మార్చి 30న విడుదల కానుంది. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా 90వ దశకం నేపథ్యంలో సాగనుందని సమాచారం. టీజర్ లోని లాస్ట్ షాట్ టెర్రిఫిక్ గా ఉంది. సినిమాపై నాని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో టీజర్ రిలీజ్ సందర్భంగా తను చెప్పిన మాటలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతకాలం పర్ఫెక్ట్ మాసివ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కోసం ఎదురుచూస్తున్న నానికి దసరా పర్ఫెక్ట్ మూవీ.
ఈ సినిమా తర్వాత నాని వేగం పెంచుతున్నారు. కొత్త దర్శకుడు శౌర్యకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం ఇటీవల ముహూర్తం కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నాని 30 చిత్రం ప్రారంభమయింది. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సివి మోహన్, విజయేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు స్క్రిప్ట్ లను నాని లాక్ చేశారు. అలాగే హిట్-3 చిత్రం చేయాల్సి ఉంది. ఇలా ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశారు. వీటితో పాటు పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పలు కథలు ఆయన వింటూ ఉన్నారు. మొత్తానికి దసరా తరువాత నాని యమా స్పీడ్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నారని సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
