Home

»

Latest News

విశాఖలో నట్టి కుమార్ స్టుడియో నిర్మాణం

Apr 5, 2011 5:16PM

natti kumarwallpapers, natti kumar stills, natti kumar images, natti kumar pics, natti kumar photos, natti kumar picturesవిశాఖలో నట్టి కుమార్ స్టుడియో నిర్మాణం చేపడుతున్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్టీల్ సిటి విశాఖపట్టణంలో ఒక సినిమా స్టుడియో నిర్మిస్తున్నారు. ఈ స్టుడియోకి యన్.కె. స్టుడియో అన్న పేరు నిర్ణయించారు. ఇప్పటికే నట్టి కుమార్ విశాఖపట్టణంలో దాదాపు 40 థియేటర్లకు పైగా యన్.కె.థియేటర్స్ పేరుతో లీజుకి తీసుకుని నడిపిస్తున్నారు. ప్రస్తుతం తాను నిర్మిస్తున్న ఈ ఫిలిం స్టుడియో పూర్తయ్యే సరికి దాదాపు రెండేళ్ళ సమయం పడుతుందని అన్నారు.


ఆయన ఇంకా ఈ స్టుడియోని అన్ని హంగులతోనూ, అన్ని సౌకర్యాలతోనూ నిర్మిస్తున్నామనీ, నిర్మాత, దర్శకులకు అవసరమైన అన్ని వసతులూ ఉండేలా నిర్మించటం జరుగుతుందనీ నట్టి కుమార్ మీడియాకు తెలియజేశారు. తానిప్పటి వరకూ అరవై సినిమాలను నిర్మించాననీ, ఇటీవల జగపతి బాబు హీరోగా నిర్మించిన "చట్టం" చిత్రానికి ప్రేక్షకుల నుండి అపూర్వమైన ఆదరణ లభిస్తూందనీ నట్టి కుమార్ అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com