
టాలీవుడ్ లో కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించేందుకు దర్శకులు కథలో అదిరిపోయే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఒక పవర్‌ఫుల్ హీరో, గ్లామరస్ హీరోయిన్, ఊపు తెప్పించే ఫైట్లతో పాటు థియేటర్లలో ఈలలు వేయించే ఒక ఐటెం సాంగ్ ఉంటే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది.
హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న మూవీ 'నేను రెడీ' (Nenu Ready). తాజాగా ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక మైండ్ బ్లోయింగ్ గ్లామర్ అప్‌డేట్‌ను పంచుకుంది.
టాలీవుడ్ వెండితెరపై మొదటిసారిగా ఒక అద్భుతమైన గ్లామర్ విస్ఫోటనం జరగబోతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో 'రాక్‌స్టార్' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సంపాదించుకుని, తన హాట్ లుక్స్‌తో ఇంటర్నేషనల్ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
'నేను రెడీ' చిత్రంలో ఒక స్పెషల్ మాస్ మసాలా ఐటెం సాంగ్‌లో నర్గీస్ ఫక్రీ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్ స్క్రీన్‌పై నర్గీస్ ఫక్రీ కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ స్పెషల్ నంబర్‌పై ఇండస్ట్రీలో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ పాటలో ఆమె తన హాట్ అండ్ బోల్డ్ స్టెప్పులతో థియేటర్లలో సెగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ మాస్ ఆడియన్స్‌కు ఇదొక అల్టిమేట్ గ్లామర్ బ్లాస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్రినాథరావు నక్కిన మార్క్ మాస్ పల్స్, మిక్కీ జే మేయర్ వెరైటీ ట్యూన్స్ కలయికలో రాబోతున్న ఈ స్పెషల్ ఐటెం సాంగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు టాక్.






.webp)
