Home

»

Latest News

నారా రోహిత్ కొత్త మూవీ 'కపాలీ'.. భయపెడుతున్న సైకలాజికల్ హారర్ ఫస్ట్ లుక్!

Jul 24, 2026 6:04PM

నారా రోహిత్ తన వైవిధ్యమైన కథా ఎంపికలతో ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటారు. విభిన్నమైన పాత్రలతో మెప్పించే ఆయన, ఈసారి మరొక సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ నూతన చిత్రాన్ని దర్శకుడు రామ్ గన్ని తెరకెక్కిస్తున్నారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్ కి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

శప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ చక్రవర్తి మంథెన, భాను కిరణ్ ప్రతాప ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఉత్కంఠభరితమైన హారర్ కథలో నారా రోహిత్ సరసన అందాల నటి హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటిస్తోంది.

నారా రోహిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. సినిమా టైటిల్ తో పాటు అత్యంత భయానకంగా, ఆకట్టుకునేలా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అన్వీల్ చేశారు. 

ఈ చిత్రానికి 'కపాలీ' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. 'కపాలీ' అంటే పుర్రెను ధరించినవాడు అని అర్థం వస్తుంది. ఈ ఆధ్యాత్మిక, తాంత్రిక నేపథ్యం ఉన్న పేరుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ కూడా ఉత్కంఠభరితంగా, భయం గొలిపే విధంగా రూపొందించబడింది. టైటిల్ లోని గూఢమైన అర్థాన్ని పోస్టర్ విజువల్స్ పర్ఫెక్ట్‌గా ప్రతిబింబిస్తున్నాయి.

దీనికి తోడు 'ఏ జర్నీ ఇంటో ది అన్నోన్' (తెలియని ప్రపంచంలోకి ఒక ప్రయాణం) అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని మిస్టరీ స్థాయిని మరింత పెంచుతోంది. మొత్తం మీద, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యంత గ్రిప్పింగ్‌గా ఉంటూ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని కలిగిస్తోంది. మేకర్స్ త్వరలోనే ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

 

Nara Rohith, Kapaali Movie, Hansika Motwani

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com