
నాచురల్ స్టార్ నాని వన్ మాన్ షో 'ది ప్యారడైజ్' సందడితో వరల్డ్ తెలుగు సినిమా మార్కెట్ కళకళలాడుతూ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే హాట్ కేకుల్లా అనే వర్డ్ ని మార్చాల్సిన పరిస్థితి. ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, 23 డేట్ (ప్రీమియర్స్) త్వరగా రావాలని తమ ఇష్టదైవాల్ని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్స్‌లో సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. అభిమానులతో నేరుగా అనుబంధాన్ని పెంచుకోవడానికి, ఒకేసారి ఏకంగా 10,000 (పదివేల) మంది అభిమానులతో భారీ ఫ్యాన్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాని ప్లాన్ చేస్తున్నారు. భారతీయ చిత్రసీమలోనే ఇంత పెద్ద ఎత్తున కేవలం ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేయడం విశేషంగా మారింది. ఈ భారీ వేడుకకు సంబంధించిన సమాచారం బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా హల్చల్ సృష్టిస్తోంది. 100% పక్కా మాస్ ఎనర్జీతో రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరికొత్త రగ్గడ్ అవతారంలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓడెల మేకింగ్ విజన్, అనిరుధ్ రవిచందర్ అందించే సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు నగరాల్లో పర్యటిస్తున్న నాని, ఇప్పటికే చెన్నై ప్రమోషనల్ ఈవెంట్లో మొదటి ఫ్యాన్ షో టికెట్‌ను స్వయంగా విడుదల చేసి ఫ్యాన్స్‌లో విపరీతమైన జోష్ నింపారు. బెంగళూరు, కొచ్చి నగరాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లలో కూడా నాని అభిమానులతో ఎంతో సరదాగా గడిపారు.
ఇది కూడా చదవండి: రియల్ వైఫ్‌తో ఇంటిమేట్ సీన్స్.. ఏం జరిగిందో అసలు నిజం చెప్పిన సిద్ధార్థ్!

అంతేకాకుండా, ఈ చిత్ర విస్తృత ప్రచారంలో భాగంగా ఏకంగా 10,000 మంది అభిమానులను ఒకే వేదికపై కలిసే అవకాశం కల్పించడం ద్వారా సినిమాపై క్రేజ్ రేటింగ్స్ మరింత ఊపందుకున్నాయి. సామాన్యుడి పాత్రలో జీవిస్తూ 'నాచురల్ స్టార్'గా కోట్ల మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాని, తన విజయంలో 100% క్రెడిట్ అభిమానులకే ఇస్తుంటారు. అందుకే ఈ భారీ మీట్ అండ్ గ్రీట్‌లో 10,000 మంది ఫ్యాన్స్‌తో వ్యక్తిగతంగా సంభాషించడం, ఫోటోలు దిగడం, వారితో నేరుగా ముచ్చటించడం వంటి విశేషాలను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.చిత్ర యూనిట్ తెలుపుతున్న వివరాల ప్రకారం, ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వేల సంఖ్యలో తరలిరానున్నారు. ఏది ఏమైనా ప్యారడైజ్ హంగామా చూసి తెలుగు సినిమా తనకున్న స్థాయిని చూసుకుంటూ మూసి మూసి నవ్వులతో మురిసిపోతూ ఉంది.
మీకు నచ్చవచ్చు: లేత మనసులు'కి 60 ఏళ్లు: షూటింగ్‌లో జమునకు ఏమైంది?.. క్లాసిక్ మూవీ వెనుక సీక్రెట్స్.!
[Nani, Nani The Paradise Ten Thousand Fans Meet, The Paradise, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






