
నేచురల్ స్టార్ నాని(Nani),శ్రీకాంత్ ఓదెల(Srikanth Odhela)కాంబోలో తెరకెక్కుతున్న'ది పారడైజ్(The Paradise)పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సదరు అంచనాల స్థాయి ఎంత అంటే పారడైస్ తో తెలుగు చిత్ర సీమలో నాని సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తాడు అనేంతలా. అభిమానులు అంతలా నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలతో పాటు యూ ట్యూబ్ లో వస్తున్న రికార్డు వ్యూస్.
పారడైజ్ ని మొదట ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో షూటింగ్ ఆలస్యం కావడం, రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఆ సమయంలోనే వస్తుందని డేట్ అనౌన్స్ చెయ్యడంతో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని, మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న 'ఇరుముడి'ని కూడా అదే తేదీన అంటే, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'ఇరుముడి' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థకు, 'ది పారడైజ్' నిర్మాతలైన ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌కు మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు క్లాష్ అయ్యే అవకాశాలు ఉండవని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రవితేజ రేసులోకి రావడంతో నాని ఆగస్టు స్లాట్ నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయమైనట్లే అని అంటున్నారు.
also read: Toxic: టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
'పారడైజ్' ఇప్పటికే 100 రోజులకి పైగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ, ఇంకా సెకండ్ హాఫ్‌కి సంబంధించిన ఒక మేజర్ పోర్షన్ షూటింగ్ బాకీ ఉందట. ఈ పెండింగ్ షూటింగ్‌తో పాటు విజువల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకి, ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులకి చాలా ఎక్కువ సమయం పట్టేలా ఉందని అంటున్నారు. సెప్టెంబర్ నెలలో వినాయక చవితి కానుకగా రావచ్చని టాక్.




