
నాచురల్ స్టార్ హోదాలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న నాని(Nani), ఈ సారి నా టార్గెట్ పాన్ ఇండియా అంటూ 'ది ప్యారడైజ్' తో ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలైతే ప్యారడైజ్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ పతాక స్థాయిలో ఉన్నాయి. పైగా నానికి దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల ఉండనే ఉన్నాడు. ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో మైండ్ బ్లోయింగ్ రికార్డులు సృష్టిస్తూ సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది.
ఫిలిం సర్కిల్స్ ల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం 'ప్యారడైజ్' నాని కెరీర్‌లోనే ఆల్‌టైమ్ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన తొలి చిత్రంగా నిలవనుంది. ముఖ్యంగా నైజాం ప్రాంత థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 37 కోట్ల రూపాయల భారీ మొత్తానికి అవుట్‌రైట్ పద్ధతిలో సొంతం చేసుకున్నట్లు సమాచారం.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం థియేట్రికల్ హక్కుల వ్యాపారమే దాదాపు 100 కోట్ల రూపాయల మార్కుని సునాయాసంగా దాటేస్తుందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ హక్కులు, డిజిటల్ ఓటీటీ హక్కులు, శాటిలైట్ అండ్ ఆడియో రైట్స్ అన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Also read: కీర్తి రెడ్డితో విడాకులు.. రెండో పెళ్లిపై #సుమంత్ వ్యాఖ్యలు వైరల్
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యున్నత నిర్మాణ విలువలతో దీనిని నిర్మిస్తుండగా, ఇప్పటికే 100 రోజులకు పైగా పక్కా ప్రణాళికతో షూటింగ్ పూర్తి చేశారు. ఎలాంటి రీషూట్‌లు లేకుండా చాలా క్లారిటీతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు స్పష్టం చేశారు. నాని సరసన కయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ మోహన్ బాబు, నెగెటివ్ రోల్ లో కనిపించి షాక్ ఇవ్వనున్నాడు. సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం మెయిన్ హైలైట్‌గా నిలవనుంది. 200 కోట్ల ప్రీ రిలీజ్ మార్కెట్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన 'ది ప్యారడైజ్' థియేటర్లలో ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి!
Nani, The Paradisem Kayadu Lohar, Srikanth Odhela





