Home

»

Latest News

నాని హీరోగా కృష్ణవంశీ చిత్రం పూజయ్యింది

Jun 29, 2011 7:08PM

నాని హీరోగా కృష్ణవంశీ చిత్రం పూజయ్యింది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, "అష్టాచమ్మా, భీమిలీ కబడ్డీ జట్టు, అలా మొదలైంది" చిత్రాల్లో హీరోగా నటించిన యువహీరో నాని హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల నిర్మిస్తున్న సినిమా పూజాకార్యక్రమాలు వారి కార్యాలయంలో జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై రెండవ వారం నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా  ఒక నూతన సంగీత దర్శకుణ్ణి, ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ పరిచయం చేయనున్నారట.

ఈ సినిమాలో హీరో నాని సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. ఆ హీరోయిన్లు ఎవరనేదీ ఇమకా తెలియరాలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబడుతున్న "ఈగ" సినిమాతో హీరో నాని బిజీగా ఉన్నాడు. అలాగే గోపిచంద్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న "మొగుడు" సినిమా షూటింగుతో కృష్ణ వంశీ బిజీగా ఉన్నాడు. మొగుడు, నాని సినిమాలకు కృష్ణవంశీ ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com