
నాచురల్ స్టార్ నాని ఏ మాతం రెస్ట్ తీసుకోకుండా 'ది ప్యారడైజ్' వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. చంటి బిడ్డ అల్లరి గురించి తల్లి ఎలా అయితే మురిసిపోతు అన్ని విషయాలు చెప్తుందో నాని కూడా అంతే. ప్యారడైజ్ కి సంబంధించిన ప్రతి విషయాన్నీ చెప్తూ అభిమానులని, ప్రేక్షకులని 25 ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ వద్ద క్యూ కట్టించాలనే ఆనందంతో ఉన్నాడు
ఈ క్రమంలోనే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నాని మాట్లాడుతు 'దర్శకుడు శ్రీకాంత్ ఒదెల మొదట ఈ కథ చెప్పినప్పుడు, దీని శైలి మరియు నేపథ్యం చూసి ఆశ్చర్యపోయాను. తెలంగాణ సంస్కృతి, నమ్మకాలు మరియు స్థానిక మూలాలతో అనుసంధానమైన కథ కావడంతో 'సమ్మక్క' అనే టైటిల్ ఈ చిత్రానికి నూటికి నూరు శాతం సరిపోతుందని నాతో పాటు అంతా భావించారు. తెలంగాణ గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజల భావోద్వేగాలు మరియు శక్తివంతమైన పాత్రల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథలోని మాతృమూర్తి పాత్ర లేదా స్థానిక దేవత ప్రాముఖ్యత ఆధారంగా శ్రీకాంత్ ఒదెల ఈ శక్తివంతమైన టైటిల్‌ను పరిశీలించారు.

Also read: నంది వచ్చేస్తుంది: తిప్పరా మీసం!
కానీ, అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో పాటు, కథలోని వైవిధ్యమైన ముఖచిత్రాన్ని ప్రతిబింబించడానికి ఆ తర్వాత 'పారడైజ్' అనే పేరు ఖరారు చేసాం. ఈ టైటిల్ వినడానికి చాలా క్లాస్‌గా అనిపించినప్పటికీ, సినిమాలో చూపించబోయేది మాత్రం ఊహించని రేంజ్ మాస్, ఎమోషనల్ యాక్షన్ . 'పారడైజ్' అనగానే అందరూ ప్రశాంతమైన ఒక అందమైన ప్రపంచం అనుకుంటారు, కానీ ఆ లోకం చాలా భిన్నంగా, అల్లకల్లోలంగా ఉంటుందని నాని చెప్పుకొచ్చాడు.
[The Paradise, Sammakka, Nani, Srikanth Odela, kayadu Lohar, Tollywood Updates, TeluguCinema News, TeluguCinema, Tollywood, Tollywood News]





