Home

»

Latest News

జూన్ 10 న బాలయ్య నందీశ్వరుడు

Jun 7, 2011 6:10PM

జూన్ 10 న బాలయ్య "నందీశ్వరుడు" సినిమా ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, నందమూరి నటసింహం, యువరత్న నందమూరిబాలకృష్ణ హీరోగా, పూర్తి కమర్షియల్ భారీ మాస్ చిత్రాలకు పెట్టింది పేరైన సీనియర్ డైనమిక్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న భారీ సినిమా "నందీశ్వరుడు". బాలయ్య "నందీశ్వరుడు" సినిమా జూన్ 10 వ తేదీన, అంటే బాలకృష్ణ జన్మదినం సందర్భంగా, ఆయన అభిమానుల సమక్షంలో, అత్యంతఘనంగా, వైభవంగా ప్రారంభం కానుంది.

బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో గతంలో రౌడీ ఇనస్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం బాపు దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న"శ్రీరామరాజ్యం", శ్రీకీర్తికంబైన్స్ పతాకంపై, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్న "మహాదేవనాయుడు" సినిమాల షూటింగుల్లో బాలకృష్ణ యమ బిజీగా ఉన్నారు. గతంలో బాలకృష్ణ హీరోగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, "లక్ష్మీనరసింహ" అనే సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com