Home

»

Latest News

నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్...?

Jun 11, 2019 12:01PM

బాల‌య్య జ‌న‌రేషన్ఓ క‌థాన‌య‌కులంద‌రూ త‌మ వార‌సుల్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేసారు. అంద‌రూ స‌క్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే బాల‌య్య త‌న‌యుడు ఎంట్రీ విష‌యంలో మాత్రం ఇంకా ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ప‌లు ప్రెస్ మీట్స్ లో త్వ‌ర‌లో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ చెప్పుకొచ్చినా ఇంకా ఆల‌స్యం ఎందుకు అవుతున్న‌ది అన్న‌ది అభిమానుల సందేహం కూడా. అయితే సోష‌ల్ మీడియాలో మోక్ష‌జ్ఞ గురించి ఒక వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే...మోక్ష‌జ్ఞ‌కు హీరో అవ్వాల‌న్న థాట్ లేద‌ట‌. వ్యాపారంలో రాణించాల‌నుకుంటున్నాడ‌ని స‌మాచారం. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న పై దృష్టి సారించ‌లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నారు. ఇక ఇటీవ‌ల మీడియా కంటికి చిక్కిన మోక్ష‌జ్ఞ ని చూస్తే త‌ను హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి ఏ మాత్రం సిద్ధంగా లేడ‌న్న విష‌యం తెలుస్తోంది.  దీంతో ఇక బాల‌య్య వార‌సుడి ఎంట్రీ డౌటే అన్న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌టికైనా బాల‌య్య వార‌సుడి ఎంట్రీ పై ఒక నిర్ణ‌యం తీసుకుంటాడో , ఏదైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి అంటున్నారు సినీ జ‌నాలు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com