సర్దార్ దెబ్బకి ఎగిరిన శ్రీమంతుడు..నిలబడ్డ లెజెండ్
on Apr 9, 2016
సినిమాలు సిల్వర్ జూబ్లీలు, శతదినోత్సవాలు ఆడే రోజులు ఎప్పుడో పోయాయి. ఎంత పెద్ద స్టార్ అయినా విడుదలైనా రెండు మూడు వారాల్లోనే దుకాణం సద్దేయాలి. ఓపెనింగ్స్ లెక్కలు చూసుకుంటూ అవే రికార్డులుగా భావిస్తుంటారు అభిమానులు. అయితే ఈ లెక్కలు మా దగ్గర కుదరవంటున్నారు మహేశ్, బాలయ్య అభిమానులు. నటసింహం నటించిన లెజెండ్ చిత్రం ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్లో కనీవినీ ఎరుగని రీతిలో 750 రోజులుగా ఆడుతూనే ఉంది. అదే సినిమా ఎమ్మిగనూరులో 450 రోజులు పైగా ఆడింది. దీనికి పెద్ద ఫంక్షన్ చేసి బాలయ్యని సత్కరించారు కూడా.
ఇదే ఎమ్మిగనూరులో బాలకృష్ణతో పాటు మహేశ్ శ్రీమంతుడు కూడా డబుల్ సెంచరీ కొట్టాడు. బాలయ్య రికార్డుని బద్దలు కొట్టేలా శ్రీమంతుడు దూసుకెళ్లాడు అయితే ఆ సినిమాని గురువారం తీసేశారు. అందుకు కారణం పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్. శ్రీమంతుడు ఆడుతున్న థియేటర్లో సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడంతో మహేశ్‌ని పక్కన పెట్టక తప్పలేదు. దీంతో సర్దార్ దెబ్బకి మహేశ్ తప్పుకున్నాడు కానీ బాలయ్య మాత్రం ఇప్పటికీ అదే జోరులో ఉన్నాడు.