
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరిర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లెజెండ్ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంభినేషన్‌లో వచ్చిన ఈ సినిమా మార్చి 28, 2014లో రిలీజైన ఈ సినిమా నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 115 వారాలుగా ప్రదర్శించబడుతున్న లెజెండ్ త్వరలో 750వ రోజుకు చేరువ కాబోతున్నది. ఈ సినిమా అన్ని వారాలు ఒకే థియేటర్‌లో ప్రదర్శించబడి టాలీవుడ్‌లో కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇలా ఈ సినిమా విడుదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకు మూడు ఉగాది పండుగలు జరుపుకుంది.




.jpg)

