Home

»

Latest News

కృష్ణ‌వంశీకి బాల‌య్య వార్నింగ్‌

Nov 12, 2016 11:27AM

నంద‌మూరి బాల‌కృష్ణ - కృష్ణ‌వంశీ క‌ల‌యిక‌లో రైతు సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌క ముందే... బాల‌య్య‌, కృష్ణ‌వంశీ మ‌ధ్య విబేధాలు త‌లెత్తిన‌ట్టు తెలుస్తోంది. క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌ల ఎంపిక త‌దిత‌ర విష‌యాల్లో బాల‌య్య‌, కృష్ణ‌వంశీల‌కు పొస‌గ‌డం లేద‌ని, అందుకే.. ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. కృష్ణ‌వంశీ క‌థ‌లో చేస్తున్న మార్పులు, చేర్పులు బాల‌య్య‌కు బొత్తిగా న‌చ్చ‌డం లేద‌ని, ఈ విష‌యంలో బాల‌య్య వార్నింగ్ ఇచ్చాడ‌ని, ప‌రిస్థితి మార‌క‌పోతే `రైతు` సినిమా ఆపేద్దాం అని స్ట్రాంగ్ గా చెప్పాడ‌ని నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

కృష్ణ‌వంశీకి ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్టుతో ప‌నిచేసిన అల‌వాటు లేదు. బాల‌య్య‌కు సీన్ టూ సీన్ ముందే చెప్పాల్సిందే. ఈ విష‌యంలోనే బాల‌య్య‌, కృష్ణ‌వంశీల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈసినిమా కోసం అమితాబ్ బ‌చ్చ‌న్ ని సంప్ర‌దించిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బీ కోసం.. క‌థ‌లో మార్పులూ చేర్పులూ చేస్తున్నారు. అవి బాల‌య్య‌కు న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. ఓ పాత్ర కోసం క‌థ‌ని అతిగా కెలికేస్తే క‌థ‌లో ఫ్లేవ‌ర్ దెబ్బ‌తింటోంద‌ని, అలాంట‌ప్పుడు ఈ సినిమా చేయ‌డం ఎందుక‌ని... బాల‌య్య భావిస్తున్నాడ‌ట‌. సో.. రైతు రిస్కులో ప‌డిన‌ట్టే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com