Home

»

Latest News

నానా పటేకర్ గొప్పతనం: రైతు కుటుంబాల్లో వెలుగులు నింపిన రియల్ హీరో.!

Oct 8, 2026 4:45PM

నానా పటేకర్ ఎంత గొప్ప నటుడో.. అంత గొప్ప వ్యక్తి కూడా. సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 

2015లో మహారాష్ట్ర తీవ్ర కరువును ఎదుర్కొన్న సమయంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు, రైతు కుటుంబాల్లో నెలకొన్న విషాద పరిస్థితులు నానా పటేకర్‌ను కదిలించాయి.

అప్పట్లో నానా పటేకర్‌ ఓ ఖరీదైన కారు కొనాలని భావించి సుమారు కోటిన్నర రూపాయలు దాచుకున్నారు. అయితే రైతు కుటుంబాల పరిస్థితిని చూసిన తర్వాత ఆ డబ్బును కారు కోసం కాకుండా బాధితులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

విషాదంలో ఉన్న రైతు కుటుంబాలను స్వయంగా కలిసి చెక్కులను అందించడమే కాకుండా.. నేను ఉన్నాననే భరోసాను ఆ కుటుంబాలకు ఇచ్చారు.

అక్కడితో ఆగిపోకుండా రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని భావించిన నానా పటేకర్.. మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి 'NAAM Foundation'ను ఏర్పాటు చేశారు.

ఈ సంస్థ ప్రధానంగా కరువు ప్రభావిత రైతులకు అండగా నిలవడంతో పాటు నీటి సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడా, విదర్భ వంటి కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగాయి.

అంటే.. అప్పట్లో రైతుల సమస్యను చూసి వ్యక్తిగత అవసరాన్ని పక్కన పెట్టిన నానా పటేకర్, ఆ తర్వాత అదే సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం నీటి సంరక్షణ వైపు అడుగులు వేశారు.

ఇది కూడా చదవండి: రాజమౌళి మరో అద్భుతం.. ‘వారణాసి’ కోసం కొత్త భాష.. ‘బాహుబలి’ని మించేలా ఉంటుంది.!

 

 

 

[Nana Patekar Helped Farmers, Nana Patekar Passed Away, Nana Patekar Death, Nana Patekar, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com