ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన నమ్రత కాంట్రవర్సీ కామెంట్స్
on Mar 18, 2016

మహేష్ బాబు చాలా కూల్ పర్సన్. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. తన కుటుంబాన్ని కూడా వివాదాలకు దూరంగానే ఉంచుతారు. అలాంటిది లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన భార్య నమ్రత చేసిన ఒక కామెంట్, ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నట్టు కనబడుతోంది. విషయంలోకి వెళ్తే, రీసెంట్ గా ఒక హైదరాబాద్ మ్యాగజీన్ కు నమ్రత ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కదా, దీన్ని మహేష్ ఎలా ఎదుర్కొంటుంటారు అని అడిగిన ప్రశ్నకు, మహేష్ కు అసలు పోటీయే లేదు. ఆయనది వేరే స్థాయి. ఎవరు అందుకోలేని ఏకైక స్టార్ హీరో మహేష్ మాత్రమే అంటూ సమాధానం చెప్పింది నమ్రత.
ఈ ఆన్సర్ పై పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా హర్టయ్యారట. మహేష్ కున్న స్టార్ స్టాటస్ ను, ఫాలోయింగ్ నూ కాదనలేం. కానీ దగ్గర్లో ఎవరూ లేనే లేరు అనడంలో అర్ధమేంటి. పవన్ మహేష్ లు ఇద్దరూ ఇప్పుడున్న హీరోల్లో టాపే. ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అని ఖచ్చితంగా అడిగితే చెప్పడం కష్టం. మరి అలాంటప్పుడు మహేష్ ను ఎవరూ టచ్ చేయలేరు అని నమ్రత చెప్పడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ మిగిలిన హీరోల ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. పవన్ , మహేష్ లు ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం వాళ్ల ఫ్యాన్స్ చాలా మందికి తెలియదు. ఈ హీరోలిద్దరికీ మధ్య ఇగో ఫీలింగ్స్ లేవు. ఎవరి ట్రాక్ వారిదే. కానీ ఇంకా ఫ్యాన్సే వీళ్ల ట్రాక్ లోకి రాలేకపోతున్నారు. మరి ఈ వివాదంపై నమ్రత ఏం సమాధానమిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



