Home

»

Latest News

Raaka: రాకాలో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ స్కెచ్ మాములుగా లేదుగా!

Jul 14, 2026 2:49PM

 

-రాకాలో మరో హీరోయిన్ ఫిక్స్
- అధికారకంగా వెల్లడి చేసిన భామ 
- 18 ఏళ్ళ కలల ప్రాజెక్ట్ 

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ(Atlee)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'రాకా'(Raaka). ఎప్పుడెప్పుడు షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని తమ ముందుకొస్తుందా అని ఎదురుచూడని అభిమాని, ప్రేక్షకుడు లేడు. సన్ పిక్చర్స్ సుమారు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా  ఒక్కొక్కరిగా క్రేజీ నటీనటులు వచ్చి చేరుతుండటంతో 'రాకా' పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. 

మూవీలో పలువురు హీరోయిన్లకు చోటుందని, కథాగమనంలో వారందరి క్యారెక్టర్స్ చాలా  కీలకమైనవనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపించినా అధికారకాంగా మాత్రం ఖరారు కాలేదు. కానీ మలయాళ క్రేజీ భామ  ఫెమినా జార్జ్  తాను రాకాలో చేస్తునట్టు అధికారకంగా ప్రకటించింది. ఇప్పుడు   పంజాబీ నటి నైలా గ్రేవల్ రాకాలో కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా స్వయంగా ఒక ఇంటర్వ్యూ ఓ వెల్లడి చేసింది. ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు 'దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయాలనేది తన చిరకాల కల అని, ఆ కల ఈ చిత్రంతో నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది  అట్లీ 18 ఏళ్ల నాటి కలల ప్రాజెక్ట్ 'రాకా'. ఇలాంటి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నాకు అవకాశం లభించడం కెరీర్‌లో ఒక మైలురాయి లాంటిది. కేవలం హిందీ చిత్రాలకే పరిమితమైన నన్ను నమ్మి, భారీ పాన్ ఇండియా  సినిమాలో కీలకమైన పాత్రకు ఎంపిక చేసినందుకు అట్లీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.   


Also read: మైఖేల్ బయోపిక్ సరికొత్త రికార్డు.. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయిల సునామీ


హిందీలో 'తమాషా', 'బరేలీ కి బర్ఫీ', 'తప్పడ్', 'ఇష్క్ విశ్క్ రీబౌండ్' వంటి విభిన్న చిత్రాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ 'మామ్లా లీగల్ హై'లో అడ్వకేట్ అనన్య ష్రాఫ్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నైలా గ్రేవల్, 'రాకా' సినిమాతోనే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్  దీపికా పదుకోణె రాకాలో కీ రోల్ పోషిస్తున్న  విషయం తెలిసిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com