Home

»

Latest News

‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్.. ఆ ఒక్క క్యాప్షన్‌తో ట్విస్ట్ ఇచ్చిన‌ మేకర్స్!

Nov 3, 2026 4:33PM

టాలీవుడ్‌లో కొన్ని జోడీలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లలో అక్కినేని నాగార్జున, టబు జోడీ కూడా ఒకటి. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ఇద్దరూ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’లో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

టబు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 4న ఉదయం 9 గంటలకు ఈ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రీ-లుక్ వీడియోను కూడా విడుదల చేశారు. పాతకాలం నాటి రేడియో, చీరలో నడుచుకుంటూ వెళ్తున్న టబు వెనుకవైపు దృశ్యాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం ‘ది ఐకానిక్ డ్యుయో ఈజ్ బ్యాక్.. బట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ లవ్’ అనే క్యాప్షన్. అంటే నాగ్, టబు మళ్లీ కలుస్తున్నా ఈసారి వారి మధ్య ప్రేమకథ ఉండదన్నమాట.

గతంలో నాగార్జున, టబు జంటగా నటించిన సినిమాల్లో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ‘కింగ్ 100’లో వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండబోతోంది? శత్రువులుగా కనిపిస్తారా? లేక కథకు కీలకమైన మరో బలమైన బంధంలో కనిపిస్తారా? అనే ఆసక్తి మొదలైంది. దర్శకుడు రా కార్తీక్ ఈసారి ఈ జోడీని ఎలాంటి కొత్త కోణంలో చూపించబోతున్నారో తెలియాలంటే నవంబర్ 4న వచ్చే గ్లింప్స్ చూడాల్సిందే.

నాగార్జున కెరీర్‌లో 100వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. ఐశ్వర్య రాజేష్, సుస్మిత భట్, అశోక్ సెల్వన్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 24, 2026న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈసారి నాగ్, టబు జోడీ ప్రేక్షకులకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందో చూడాలి.

 

 

[Nagarjuna King 100, King 100 Tabu Glimpse, Nagarjuna Tabu Reunion, King 100 Movie Update, Tabu Birthday Special Glimpse, Nagarjuna 100th Movie, Ra Karthik, King 100 Release Date, Devi Sri Prasad]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com