Home

»

Latest News

అప్పుడే ఓటీటీలోకి 'నాగబంధం' మూవీ.!

Jul 15, 2026 10:59AM

ఇటీవల తెలుగు ప్రేక్షుకుల దృష్టిని ఆకర్షించిన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. 'పెదకాపు' సినిమాతో గుర్తింపు పొందిన విరాట్ కర్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. ఈ హై ఓల్టేజ్ ఫాంటసీ అడ్వెంచర్ లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించగా, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, మహేశ్ మంజ్రేకర్, గరుడ రామ్, జయ ప్రకాష్, మురళీ శర్మ వంటి భారీ తారాగణం కీలక పాత్రలను పోషించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్‌ సొంతం చేసుకుంది. సినిమాలోని కథాంశం కంటే, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ సినిమా చూడని వారు, ఓటీటీలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు మొదటి వారంలో 'నాగబంధం' ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే హిందీ వర్షన్ కోసం మాత్రం దాదాపు ఎనిమిది వారాల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

 

 

Virat Karna, Abhishek Nama, Nagabandham, OTT Release

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com